వైభవంగా పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి వారి రథోత్సవం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు శ్రీ పార్వతిసమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం రధోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రధోత్సవ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా సుమారు 20వేలమంది పైగ భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో పొదిలి పట్టణంలోని ప్రధానవీధులు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అనవాయితీ గా రథం రోడ్ నుంచి మహిళలు చేత రథాన్ని లాగే కార్యక్రమంలో వేలాది మంది మహిళ భక్తులు పాల్గొన్నారు

రధోత్సవ కార్యక్రమానికి హాజరైన భక్తుల సౌకర్యార్థం భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.

అధికసంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ మల్లిఖార్జునరావు, ఎస్ఐ రామకోటయ్య కొనకనమిట్ల ఎస్ఐ మాధవ రావు, పలువురు ఎస్ఐలు ఏ మరియు కానిస్టేబుళ్లతో భారీ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటుచేసిన దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షించి సలహాలు సూచనలు అందించారు.