తాజా వార్తలు

ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించాం : వైవి సుబ్బారావు

January 23, 2019

జనవరి 21నుండి ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించామని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు అన్నారు. పొదిలి టైమ్స్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఒంగోలులోని జిల్లా గ్రంధాలయంలో 45రోజులపాటు జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 కి సంబంధించి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ సదవకాశమని అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.

Read More

తెలుగు యువత ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు

January 23, 2019

నారా లోకేశ్ జన్మదిన వేడుకలు తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు జ్యోతి మల్లి, జి నరసింహారావు, వెంకట్రావు, వరికూటి వెంకటేశ్వర్లు, షేక్ గౌస్ బాషా, తెలుగు యువత నాయకులు ముల్లా జిందాబాషా, ముల్లా జిందాబాషా (హేచ్ వై డి), ముల్లా మున్సూర్, షేక్ రియాజ్, తులసీ, […]

Read More

ఘనంగా లోకేశ్ జన్మదిన వేడుకలు

January 23, 2019

ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్ధానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి నుండి పెద్ద బస్టాండ్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం జన్మదిన కేకును కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, సామంతపూడి నాగేశ్వరరావు,యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, ముల్లా ఖుద్దూస్, షేక్ షబ్బీర్, షేక్ యాసిన్, తెలుగు మహిళా నాయకులు షేక్ […]

Read More

పౌరసరఫరాల శాఖ గిడ్డంగి ప్రారంభించిన…. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి

January 23, 2019

స్థానిక మార్కాపురం అడ్డరోడ్డులో నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల శాఖ గిడ్డంగిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే పౌరసరఫరాల శాఖ గిడ్డంగి నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, మరియు రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ దివి శివరాంలకు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో బైకు ర్యాలీ గోదాము వద్దకు చేరుకోగానే అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత భవన నిర్మాణ […]

Read More

భూమి విషయమై దాయాదుల మధ్య ఘర్షణ…. వ్యక్తి మృతి మరొకరికి గాయాలు

January 23, 2019

భూమి విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి గాయపడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొదిలి మండలం ఏలూరు గ్రామంనందు భూమి విషయమై దాయాదులైన చిన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి….. చిన్నపురెడ్డి రమణారెడ్డికి జరిగిన ఘర్షణలో చిన్నపురెడ్డి రమణారెడ్డి పొలం దున్నుతున్న సమయంలో చిన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ట్రాక్టరుతో తొక్కించడంతో రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు తీవ్ర గాయాలవడంతో గాయపడిన ఇద్దరిని బంధువులు ఒంగోలు రిమ్స్ కు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో రమణారెడ్డి మృతి చెందగా మృతదేహాన్ని […]

Read More

అభ్యర్థి ఎంపికలో వేగంగా పావులు కదుపుతున్న జనసేన

January 21, 2019

జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం అభ్యర్ధి ఎంపికలో పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదపడం ప్రారంభించింది. నియోజకవర్గంలో అధికశాతం ఓటర్లు కలిగిన యాదవ సామాజిక వర్గం నుండి లేకపోతే వైశ్య సామాజిక వర్గం నుండి అభ్యర్థిని ఎంపిక చేసే దిశగా పావులుకదుపుతూ ఈ విషయంపై నియోజకవర్గంలోని కొంతమంది నాయకులతో పార్టీ అధిష్టానం చర్చలు జరిపినట్లు సమాచారం….. వారితోపాటు మరో ఇద్దరు జడ్పీటిసి సభ్యులతో కూడా జనసేన పార్టీ అధిష్టానం చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం…….ఏదేమైనా నెల ఆఖరులోగా […]

Read More

రిలే నిరాహారదీక్ష ప్రారంభించిన నేషనల్ మజ్దూర్ యూనియన్

January 21, 2019

ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తమ డిమాండ్లయిన పేస్కేల్ పెంపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, గ్యారేజ్ సర్క్యులర్ నెం:3 రద్దు, సిబ్బంది కుదింపు రద్దు వంటి 12డిమాండ్ల సాధనకై జనవరి 21, 22 తేదీలు రిలే నిరాహారదీక్షలు పొదిలి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పొదిలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఎంయూ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో

Read More

యువకుడిపై దాడి….. చికిత్స పొందుతున్న యువకుడు

January 19, 2019

విశ్వనాధపురంలోని స్థానిక చిన్న చెరువు ఎస్సీ హాస్టల్ సమీపంలో శనివారంనాడు స్థలం విషయమై జరిగిన వివాదంలో బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో కళ్యాణ్ అనే యువకుడికి గాయాలయ్యాయి. స్థలం విషయమై జరిగిన గొడవలో పోలా బాలకోటయ్య మరియమ్మలు తనపై బీరు సీసాతో దాడికి యత్నించారని ప్రస్తుతం పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ తెలిపారు

Read More

నూకసానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి : అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్

January 19, 2019

ప్రకాశంజిల్లా మాజీ జిల్లాపరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజీకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అఖిలభారత యాదవ మహాసభ డిమాండ్ చేసింది. పొదిలిలోని స్థానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యక్రమంలో శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 56మండలాల్లో బలమైన అనుచరవర్గం కలిగిన నాయకుడిగా వైసీపీ జిల్లా వ్యవస్థాపకఅధ్యక్షులుగా ఉండి కందుకూరు సమన్వయకర్తగా పోతుల రామారావు గెలుపులో అత్యంత కీలక పాత్రపోషించి జిల్లాలోని బీసీలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నూకసాని […]

Read More

పాదయాత్ర ప్రారంభించనున్న కందుల

January 19, 2019

అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి అనే నినాదంతో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి పాదయాత్ర తలపెట్టనున్నారు. శనివారంనాడు పొదిలి స్థానిక నవాబుమిట్ట నందు డీప్ బోరును ప్రారంభించిన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ జనవరి 21వతేదీ సాయంత్రం నుండి అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి అనే నినాదంతో ప్రజలలోకి పాదయాత్రగా అభివృద్ధి కార్యక్రమాలు వివరించనున్నామని ఈ పాదయాత్ర మార్కాపురం, తర్లుపాడు మీదుగా ఫిబ్రవరి 4వతేదీన పొదిలి భారీ ముగింపు సభతో పాదయాత్ర ముగిస్తామని తెలిపారు.

Read More