తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో భగ్గుమన్న అసంతృప్తి……

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో భగ్గుమన్న అసంతృప్తి……

నాయకుల స్వలాభం కోసం పార్టీని బలి చేస్తున్నారని కార్యక‌ర్తల ఆవేదన…..

పొగడ్తలకే పరిమితమైన నాయకుల ప్రసంగాలు…..

నాయకులు తీరుపట్ల విస్మయం వ్యక్తం చేసిన కార్యకర్తలు……

మరోసారి అవకాశం ఇవ్వండి నేను ఏంటో నిరూపించుకుంటా : కందుల

 

తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల అసంతృప్తితో భగ్గుమన్నది నాయకులు స్వలాభం కోసం పార్టీని బలి చేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే పొదిలి మండల తెలుగుదేశం పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశం గురువారం ఉదయం స్ధానిక సాయి కళ్యాణ మండపంలో యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సభాధ్యక్షతన జరిగింది. మండల జన్మభూమి కమిటీ సభ్యులు ఎండీ గౌస్ మాట్లాడుతూ పార్టీ నాయకులు తీరుతో కార్యకర్తల మనోవేదన చెందుతున్నారని వారి వారి లబ్ధికోసం పనులు చేసుకొని కోట్లు కూడబెట్టుకుని పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాటూరివారి పాలెం గ్రామానికి చెందిన గొల్లపూడి వెంకట్రావు మాట్లాడుతూ వేదికపైన ఉన్న నాయకులందరూ పార్టీని నాశనం చేస్తున్నారని తమ గ్రామంలో వైసీపీ నుండి తెదేపాలో చేరిన నాయకులు ఈ సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మండల యస్సీ సెల్ అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ పొదిలి పట్టణంలో 32డిప్ బోర్లు వేశారని నేను మా ప్రాంతంలో ఒక్క బోరు అడిగినా ఎవరూ పట్టించుకోలేదని దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని నాయకుల తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుంచేపల్లికి చెందిన దళిత కార్యకర్తలు మాట్లాడుతూ తమ గ్రామంలో నాయకులు ఎవరి పనులు వారు చేసుకుంటూ పార్టీ విషయమే పక్కనపెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. పలు గ్రామాల నుండి కార్యకర్తలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేశారు. కార్యకర్తలు, నాయకులు మాట్లాడిన తరువాత చివరిగా మార్కాపురం శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మరోసారి నాకు అవకాశం ఇస్తే నేనేంటో నిరుపించుకుంటా అని మార్కాపురం రాజకీయాలలో మార్పు చూపిస్తానని అన్నారు. పొదిలి మండలంలో పార్టీ నాయకుల మధ్యలో సఖ్యత లేకపోవడం వలన కార్యకర్తలు నిరాశ చెందారని….. కాబట్టి జరిగింది వదిలేసి జరగబోయే ఎన్నికలలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై దృష్టి పెట్టి విజయం సాధించే విధంగా ఐక్యతతో ముందుకు వెల్దామని అన్నారు. అదేవిధంగా మండలంలోని నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరూ ఒక్కో గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని పనిచేయాలని ఇకపై కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తన దృష్టి తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనాల వీరబ్రహ్మం, పియల్పీ యాదవ్, ఏఎంసి చైర్మన్ చప్పిడి రామలింగయ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు,సామంతపూడి నాగేశ్వరరావు, కాటూరి సుబ్బయ్య, కాటూరి నారాయణ, ప్రతాప్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రసూల్, పట్టణ అధ్యక్షులు షేక్ జిలానీ, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు, ముల్లా ఖుద్దుస్, ఆవులూరి కోటేశ్వరరావు, తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్, తెలుగు మహిళ నాయకులు సోమిశెట్టి శ్రీదేవి, కిరణ్మయి, షేక్ షహాన్జ్, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.