పెదారికట్లలో తెదేపా, పొదిలిలో వైకాపా గా చెప్పుకునే వారికి ప్రాతినిధ్యం కల్పించడంపై జంకెను ప్రశ్నించిన కార్యకర్తలు……

వాడి వేడిగా కొనకనమిట్ల కార్యకర్తల సమావేశం……

త్వరలోనే మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించిన ఉడుముల

పెదరికట్ల గ్రామంలో తెలుగు దేశం పార్టీ అంటూ పొదిలి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ తిరిగే నాయకులకు అధిక ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డిని పెదారికట్లకు చెందిన కార్యకర్తలు ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం స్థానిక మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులరెడ్డి గృహంలో కొనకనమిట్ల మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక‌ర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు తమకు జరుతున్న ఇబ్బందులు మరియు వివిధ సమస్యల గురించి శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డికి వివరించి వారి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులరెడ్డి కార్యకర్తలను సముదాయించి మీ మనోవేదన నాకు అర్ధమైందని త్వరలోనే మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు ఉడుముల రామనారాయణరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, తదితరులు భారీగా హాజరయ్యారు.