యువజన కాంగ్రెస్ పోరు యాత్రకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకై యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ ల ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర పొదిలికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఉప్పలపాడు, గోగినేనివారిపాలెం, తలమల్ల, అగ్రహారం, కాటూరివారిపాలెం మీదుగా పొదిలి చేరుకున్నారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికి మహిళలు హారతులు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్ సైదా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ గౌస్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు చందు నాయక్, పొదిలి సంతనూతలపాడు మరియు కొండేపి నియోజకవర్గాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రసూల్, రవి, పొదిలి మరియు మర్రిపూడి మండలాల అధ్యక్షులు నసిరుద్దీన్, సుబ్బారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు బాబా ఖాదర్ వలి, మాజీ సర్పంచ్ ఐజక్ న్యూటన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కురుగుంట సుబ్బారావు, కొత్తపులి ఈశ్వర్ రెడ్డి, ముల్లా జిలాని తదితరులు పాల్గొన్నారు.