వైసీపీ ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు

వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి 46 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే స్ధానిక చిన్న బస్టాండ్ నందు వైయస్ఆర్ సిపి నాయకులు షేక్ రబ్బాని నాయకత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా హాజరైన కొత్తపులి బ్రహ్మ రెడ్డి, హనీమూన్ శ్రీనువాసులరెడ్డిలు కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్తపులి బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఈ దుష్టపాలనకు చరమగీతం పాడి వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. మండల యూత్ అధ్యక్షులు హనీమూన్ శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీ పేరుతో పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేసి సంక్షేమ పథకాలు అన్ని పసుపు పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారని అన్నారు. వైసీపీ పట్టణ నాయకులు షేక్ రబ్బాని మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల పాటు ముస్లింలకు మంత్రివర్గంలో స్ధానం లేకుండా పాలన సాగించిన చరిత్ర చంద్రబాబుదే అని ఇలాంటి మైనారిటీ వ్యతిరేకికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేశారని మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ నాయబ్ రసూల్, షేక్ గౌస్ భాషా, ముల్లా బాషా, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.