జగన్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 46వ జన్మదిన వేడుకలు సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. శుక్రవారం స్ధానిక నందిపాలెం గ్రామం నందు వైసీపీ యూత్ మండల ప్రధాన కార్యదర్శి పొదిలి ఏడుకొండలు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన శుభాకాంక్షల కేకును కోసి కార్యక‌ర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయి, ఎంపిపి నరసింహరావు, మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, పార్టీ మండల నాయకులు నారాయణరెడ్డి, బాలయ్య యాదవ్, పొదిలి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.