ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

పొదిలిలోని స్థానిక దర్శి రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి డీఎడ్ కళాశాలలో ముందుగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఎస్వీకేపీ డీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ వేల్పుల కృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వేసి అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల సిబ్బంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుని అనంతరం పలువురు సిబ్బంది 3రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ దాని విశిష్టతను తెలిపారు. ఎస్వీకేపీ కరస్పాండెంట్ జిసి సుబ్బారావు, ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రత్నశేఖర్, ఎస్వీకేపీ డిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ వేల్పుల కృష్ణంరాజు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.