పంచాయితీ కార్యదర్శిని ఢీకొట్టిన అధికారపార్టీ నేత వాహనం

ఉదేశ్యపుర్వకమా ?…… ప్రమాదమా!

ప్రభుత్వ వైద్యుల వద్దకు చేరుకున్న మర్రిపూడి మండల అధికారపార్టీ నాయకులు

కేసు నమోదు లేకుండా కార్యదర్శిపై ఒత్తిడి

కార్యదర్శిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించిన అధికారపార్టీ నేతలు

అధికారపార్టీ నేతల ఒత్తిడికి తట్టుకోలేక కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తున్న బంధువులు

మర్రిపూడి మండలం ధర్మవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న చిన్నపురెడ్డి తిరుమల నారాయణ కార్యాలయ పని నిమిత్తం మర్రిపూడి నుండి పొదిలి వస్తుండగా మార్గం మధ్యలో మర్రిపూడి మండలానికి చెందిన అధికారపార్టీ నాయకుడి వాహనం ఢీకొనడంతో పంచాయతీ కార్యదర్శి కాలుకు తీవ్ర గాయం అవడంతో స్ధానికులు గాయపడిన వ్యక్తిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన కార్యదర్శి తొలుత ఉదేశ్యపుర్వకంగా నన్ను కారుతో ఢీకొట్టారని చెప్పి ……. తరువాత ఎక్స్ రే తీయించుకురావడానికి ఒక ప్ర్రెవేటు వైద్యశాలకు వెళ్లి రాగానే కార్యదర్శి మౌనం వహించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ వైద్యశాలకు అధికారపార్టీ నాయకుడు అతని అనుచరులతో వచ్చి కార్యదర్శిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకొని వెళ్ళడం జరిగింది. బంధువులు మాత్రం అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక మౌనంగా ఉన్నాడని ఆరోపించారు. జరిగిన సంఘటన ప్రమాదమా లేక ఉదేశ్యపుర్వకమా అనేది బాధితుడు నోరు మేదిపితే కాని వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు అంటున్నారు. కాగా ఈ సంఘటనపై పొదిలి మర్రిపూడి మండల ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.