అస్మమతిని అధిగమించి కందుల విజయసాధించేనా!

మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి జాబితాలోనే పార్టీ అధిష్టానం కందుల నారాయణరెడ్డి పేరును ఖరారు చేసిన విషయం పాఠకులకు విధితమే. కందుల నారాయణరెడ్డి రాజకీయ జీవితం 2004సాధారణ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూడడంతో మొదలైన తన రాజకీయ ప్రస్థానం అనంతరం ప్రకాశంజిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేస్తు జిల్లా యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పార్టీ అధిష్టానానికి దగ్గరయ్యారు.

అనంతరం 2009నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్కాపురం నియోజకవర్గం నైసర్గస్వరూపం పూర్తిగా మరిపోవడంతో మార్కాపురం టౌన్ మరియు రూరల్, తర్లుబాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాలతో మార్కాపురం నియైజకవర్గం ఏర్పాటు అవడం….. ఎన్నికలకు ఏడాది ముందు నుండి గడప గడపకు తిరిగి పార్టీ కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలు నాయకులను కలుపుకుని పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్ళి….. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ బలమైన గాలి, మరో వైపు ప్రజారాజ్యం పార్టీని తట్టుకుని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా యం యం కొండయ్య యాదవ్ పోటీ చేయడంవలన యాదవ సామాజిక వర్గం యొక్క మెజారిటీ ఓట్లు సంపాదించుకుని జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక శాసనసభ్యులుగా చరిత్ర సృష్టించారు.

2014 సాధరణ ఎన్నికల్లో తిరిగి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందులకు జగన్మోహన్ రెడ్డి గాలి బలంగా ఉండడం మరియు పార్టీలో కార్యకర్తలు సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి చవిచూడవలసి వచ్చింది.

ప్రస్తుతం పరిస్థితులలో కూడా తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న నేపథ్యంలో తిరిగి పార్టీ అభ్యర్థిత్వం తెచ్చుకోడంలో సఫలీకృతమై పోటీకి సిద్ధమయ్యారు. ఏదేమైనా కందుల రాజకీయ వ్యూహం ఏమాత్రం ఫలిస్తుంది…… అసమ్మతితో ఉన్న నాయకులను, ప్రజలను ఎలా బుజ్జగిస్తారు…… ఈసారి ఎన్నికలు కందులకు కలిసొస్తాయా అనేది తెలియాలంటే మే 22 ఓటర్లు ఇచ్చే ఫలితంతో వెల్లడికానుంది. .

బలం : 1. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసే శిద్దా రాఘవరావు సామాజిక వర్గమైన వైశ్యులు గుత్తగా ఓట్లు వేసే అవకాశం……….
2. వైయస్ఆర్సీపి శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డికి టికెట్ కేటాయించక పోవడంతో జంకె వర్గం కందులకు సహకరించే అవకాశం.

బలహీనత : 1. అస్మమతి నేత ఇమ్మడి కాశీనాథ్ జనసేన పార్టీ తరపున లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే జరగబోయే నష్టం………
2. పార్టీలోని నాయకులలో తీవ్రమైన అసంతృప్తి………
3. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 80 శాతం పైగా అండగా ఉండే యాదవ సామాజికవర్గం తీవ్రమైన అసంతృప్తితో దూరంగా ఉండడం……..
4. పార్టీపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత.

ఏదేమైనా అభ్యర్థుల గెలుపు ఓటములు తెలిసే సమయం ఎంతో దూరంలో లేదు అప్పటి వరకు వేచిచూద్దాం.