మార్కాపురం కోటపై బిసి జెండా ఎగిరేనా!

మార్కాపురం నియోజకవర్గంలో వెనకబడిన తరగతుల ప్రతినిధిగా పోటీ చేసే బిసి జెండా ఎగిరేనా!…….. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్ తెలుగు దేశంపార్టీ టికెట్ బిసి కోటా క్రింద ప్రయత్నం చేయడం…… పార్టీ అధిష్టానం తనకు కాకుండా తాను తీవ్రంగా వ్యతిరేకించే కందుల నారాయణరెడ్డిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో తన భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జనసేన పార్టీ తరపున పోటీకి సిద్ధం పడడం…… ఆ వ్యూహం దిశగా పావులు కదుపుతున్నారు.

ఇమ్మడి కాశీనాథ్ 1992లో యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి మూడు దఫాలుగా మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరియు రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రచార కార్యదర్శిగా అలాగే కార్యదర్శిగా పని చేశారు.

2008లో జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఘన విజయం సాధించిన ఇమ్మడి కుటుంబం నేపథ్యం చూసుకుంటే ఇమ్మడి కాశీనాథ్ తాత నక్కా వెంకటయ్య (లండన్ వెంకటయ్య) 1951లో కృషికార్ లోక్ పార్టీ తరుపున మార్కాపురం నియోజకవర్గంలో తొలి శాసనసభ్యులుగా ఎన్నికవగా 1955లో మద్రాసు రాష్ట్రం విభజన జరిగిన తరువాత ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి
భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున పోటీచేసి తొలి శాసన సభ్యులుగా విజయం సాధించారు. అదేవిధంగా తన మామ వెలుగొండ ప్రాజెక్టు ప్రదాత జిల్లాలో అత్యంత సూపరిచితుడైన పూల సుబ్బయ్య
యర్రగొండపాలెం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 1962 ,1967లో……. మార్కాపురం నుండి 1977లో గెలుపొందారు.

ఇమ్మడి కాశీనాథ్ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే కాకుండా….. తన తండ్రి వైద్య వృత్తిలో మార్కాపురం డివిజన్ లో పూర్తి కాలం పనిచేయడంతో ప్రజలకు అత్యంత చేరువయ్యారు.

బలం : 1. రాజకీయ నైపథ్యం కుటుంబం కావడం వలన కలిసి వచ్చే అవకాశం…….. 2.నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండడం…… 3. బిసి సామాజిక వర్గం కావడం……. 4. నియోజకవర్గంలోని అత్యధిక ఓట్లు కలిగిన యాదవులు అండగా ఉండడం…….. 5. జనసేన పార్టీకి యువతలో క్రేజ్ ఉండడం…….. 6. తెలుగు దేశం పార్టీ అస్మమతి వర్గం సహకారం.

బలహీనత : 1.బలమైన నిర్మాణంలేని జనసేన పార్టీ
2. హంగులు ఆర్భాటాలు లేకుండా…… బాహాటంగా తిరిగే పనిచేసే నాయకత్వం లేకపోవడం.

ఇదిలా ఉంటె అత్యధికంగా ఓటు బ్యాంకు కలిగిన యాదవ సామాజికవర్గం అండగా ఉండడం……. అలాగే బిసి కులాల మద్దతు ఉండడం……. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉండడం బలమైన అనుచర వర్గం కలిగి ఉండడం……… ఇవన్నీ ఇమ్మడికి ఎలా కలిసిరాబోతున్నాయో వేచి చూడాలి.