ఆక్రమంగా ఫారం:6, 6ఎ,7,8,8ఎ దాఖలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: తహశీల్దార్

మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పొదిలి మండలంలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎవరైనా ఆక్రమంగా ఫారం 6ఎ ,7, 8,8ఎ దాఖలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పొదిలి మండల తహశీల్దార్ యస్ ఎం హమీద్ పొదిలి టైమ్స్ ప్రతినిధికి తెలిపారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం స్థానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఆక్రమంగా ఫారాలు దాఖలు చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం మరియు సైబర్ నేరం క్రింద క్రిమినల్ కేసులు నమోదు చెస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఎవరైనా ఓటు తొలగింపుకు సంబంధించిన ఫారం 7 దాఖలు చేస్తే సంబంధించిన వ్యక్తులను విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఈ విషయంపై ప్రజలు ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు.