బంధీ అవడానికి ముందు అభినందన్ గాలిలోకి కాల్పులు జరిపాడు

పాకిస్థాన్ డాన్ పత్రిక కధనం ప్రకారంభారత పైలట్ అభినందన వర్ధమాన్ తాను బంధీ కావడానికి ముందు గాలిలోకి కాల్పులు జరిపాడు

వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ& కాశ్మీర్ భీమ్మర్ జిల్లాలోని కంట్రోల్ అప్ లైన్ (యల్ఓసి) నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న
హోర్రా గ్రామంలో సుమారు ఉదయం 8.45 నిమిషాల సమయంలో ప్యారచూట్ ద్వారా దిగిన అభినందన్ ని చూసిన స్ధానిక గ్రామస్థులు పాకిస్థాన్ ఆర్మీకి చరవాని ద్వారా అందించగా అధికారులు మేము వచ్చే వరకు శిధిలాల దగ్గరకు కాని, పైలట్ ను కాని పట్టుకోవద్దని భారత ప్రజలని నమ్మించే విధంగా మాట్లాడండి అని తెలిపారని…… ఈ క్రమంలోనే గ్రామంలోని యువకులు పైలట్ దగ్గరకు చేరుకున్నారు.

పైలట్ ఇది భారత్ లేక పాకిస్థానా అని అడగగా ఒక యువకుడు భారత్ అని తెలిపాడు. పైలట్ ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానని ప్రశ్నించగా క్యూలా ప్రాంతంలో ఉన్నావని అన్నారని చెప్పారు. త్రాగడానికి నీరు కావాలని అడగగా…… అయితే యువకులు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన పైలట్ భారత్ మతాకి జై అంటూ నినాదాలు ఇవ్వడంతో కోపోద్రిక్తులైన పాకిస్థాన్ యువకులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇవ్వడంతో….
తాను పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంలో ఉన్నానని ఆర్ధమై వారికి పట్టుబడే లోపు తన దగ్గర ఉన్నా లక్ష్య ఛేదన చెయ్యవలసిన మ్యాప్ సంబంధించిన డైరీ మరియు సాంకేతక పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలను తక్షణమే ద్వంసం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మెరుపు వేగంతో ఆలోచన చేసి గాలిలోకి కాల్పులు జరుపుకుంటూ సుమారు ఒక కిలోమీటర్ల మేర పరుగు తీసి సమీపంలో పారుతున్న నీటిలోకి దూకి…. తనపై రాళ్ళతో దాడి చేస్తున్న తన వద్ద ఉన్న రక్షణ శాఖ సమాచారాన్ని వారికి దొరకకుండా మ్యాప్ చించి వేసి ఇతర పుస్తకాలను నీటిలో తడపటం ద్వారా సమాచారం శత్రువులకు దొరకకుండా ప్రయత్నం చేసిన అనంతరం …
చివరికి యువకులకు లొంగిపోతానాని తెలిపి వారికి లొంగిపోవడం జరిగింది. పాకిస్థాన్ సైన్యం వచ్చే లోపల లొంగిపొయిన పైలట్ పై దాడి చేసిన యువకులు సైన్యం రాగానే చేతులు కట్టివేసి కళ్ళుకు గంతలు కట్టి సైనిక వాహనల కాన్వయ్ లో హోర్రా గ్రామం నుండి బైబర్ సైనిక స్ధావరంలోకి తీసుకుని వెళ్ళినట్లు తెలిపింది.
” జై అభినందన్ ”
ఈ సారాంశాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు భారతీయుల ఆత్మస్థైర్యం….. మెరా భారత్ మహాన్……జై హింద్…