కొండచిలువ కలకలం…. చాకచక్యంగా పట్టుకున్న యువకులు

పొదిలిలోని స్థానిక నవాబుమిట్ట ప్రాధమిక పాఠశాల వద్ద కొండచిలువ తారసపడడంతో స్థానిక యువకులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న రాళ్ళ గుట్టలో చొరపడడంతో……

యువకులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి రాళ్ళగుట్ట చుట్టూ మంట పెట్టడడంతో కొద్దిగా బయటికి వచ్చిన కొండచిలువను ఓ గోనసంచిలో బంధించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీరామ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారనే సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్నానని…. యువకులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అప్పటికే బంధించారని…. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాం వారు రాగానే వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు.