మందళగిలి మాలోకాన్ని చంద్రబాబు సిఎం చేస్తాడట : లక్ష్మీ పార్వతి

మందళగిలి మాలోకాన్ని చంద్రబాబు సిఎం చేస్తాడని దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి అన్నారు.

వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కపురం నియోజకవర్గ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఏర్పాటు చేసిన రోడ్ షో కు ముఖ్యఅతిథిగా స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు.

పట్టణంలోని స్థానిక మర్రిపూడి అడ్డరోడ్డు నుండి మొదలైన రోడ్ షో చిన్న బస్టాండ్, పెద్దబస్టాండ్, విశ్వనాథపురం మీదుగా మార్కాపురం అడ్డరోడ్డు వరకు సాగింది.

ఈ సంధర్భంగా స్థానిక విశ్వనాథపురం సెంటర్ లో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధనలో విఫలం అయ్యారని దానికి కారణం ఆయన నిలకడలేని తనమని అన్నారు. అలాగే నదుల అనుసంధానం చేశానని చెప్పుకుంటున్న ఆయనకు ప్రజలు పడుతున్న నీటి కష్టాలు కనపడట్లేదా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణమని చెప్పి సినిమాలో చూపే తరహాలో గ్రాఫిక్స్ చిపించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె అన్నారు. స్పష్టత లేకుండా ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాకుండా మాట్లాడే తన వారసుడైన మందళగిలి మాలోకం లోకేష్ కు సీఎం కుర్చీ కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని…… వయసు పైబడిన చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందని ఇప్పుడు హామీలు ఇచ్చినా మరచిపోవడానికి ఆయనకు ఎంతో సమయం పట్టదని అన్నారు.

ఇప్పటివరకు చేసిన ముఖ్యమంత్రులలో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్, దివంగత వైఎస్ఆర్ అని…… వారిరువురి ఆశయాలను పునికిపుచుకున్న జగన్ ను సీఎం చేయాలని కోరారు.

ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పెద్దచెరువును రిజర్వాయర్ గా మార్చడానికి, వెలుగొండ పూర్తి కావడానికి జగన్ ను సీఎం చేయాలని జగన్ ను సీఎం చేసే దిశగా……. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన నన్ను, మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి అయిన కుందూరు నాగార్జునరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మార్కాపురం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పొదిలి పెద్దచెరువుకు రిజర్వాయర్ సాధనకోసం ఎంతో కృషి చేశామని అయినా ఈ ప్రభుత్వానికి మన గోడు వినపడలేదని….. జగన్ ముఖ్యమంత్రి అయితే పొదిలికి సాగర్ కెనాల్ నుండి అలాగే వెలుగొండ ప్రాజెక్టు నుండి ఖచ్చితంగా పొదిలికి నీరు వస్తుంది తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.