పొదిలి నగర పంచాయితీ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని యుటియఫ్ డిమాండ్

సమ్మెకు మద్దతుగా సంఘీభావం

 

పొదిలి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సుమారు 50 మంది మరియు మేస్త్రీలు 12 మంది మొత్తం 62 మంది కార్మికులకు సంబంధించిన జీతాలు  జనవరి నెల నుండి ఇప్పటివరకు జూన్ నెల వరకు ఆరు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై డిమాండ్  చేశారు.

మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీ గా మారిన తరుణంలో కార్మికులకు జనవరి నెల నుండి జీతాలు రావడం లేదని అన్నారు నగర పంచాయతీ కమిషనర్ గారు చొరవ చూపించి అధికారులతో జిల్లా కలెక్టర్ లేదా మున్సిపల్ ముఖ్య కార్యదర్శి తో మాట్లాడి వెంటనే నగర పంచాయతీ కమిషనర్ గారికి డ్రాయింగ్ అధికారాలు, బయోమెట్రిక్ అధికారాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నగర కార్మికుల దీక్ష కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు

పొదిలి మండల అధ్యక్షుడు డి బాల కాశి రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు యూనిఫామ్ మరియు కాస్మోటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని అన్నారు
యుటిఎఫ్ జిల్లా కుటుంబ సంక్షేమ డైరెక్టర్ చవలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులకు పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని మరియు కరోనా తో చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు

పొదిలి మండల ప్రధాన కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ కార్మికుల కు ప్రమాదం సంభవించినప్పుడు వైద్య ఖర్చుల కు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అన్నారు

మరిపూడి మండలం ప్రధాన కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వము హెల్త్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ  కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బుజ్జి బాబు, పాలడుగు వెంకటేశ్వర్లు, డి కోటేశ్వరరావు, గుంటూరిరమణారెడ్డి ,పి కిరణ్ కుమార్ ,ఎస్ సత్యనారాయణ రెడ్డి ,డి నారాయణ రెడ్డి పోతురాజు ఏడు కొండలు, సిహెచ్ శేషారావు, పి శ్రీనివాసులు  తదితరులు పాల్గొన్నారు