కబడ్డీ పోటీలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కోటేశ్వరి

మార్కాపురం నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వైసిపి యూత్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ మైదానం నందు గురువారం నాడు కబడ్డీ పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.

మరో ముఖ్య అతిథి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి క్రీడాకారులతో కరచాలనం చేసి సన్నాహ పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ మొత్తం 25 టీం లు పోటీ పాల్గొననున్నాయని మొత్తం నాలుగు బహుమతులు ప్రధానం చేస్తున్నామని శనివారం నాడు ఫైనల్ మ్యాచ్ జరుగనుందని…..

బహుమతి ప్రధానం రోజున ముఖ్య అతిథిలుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి, కెపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరుకాన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి, వైసిపి నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, సాయి రాజేశ్వరరావు, గొలమారి చెన్నారెడ్డి, తాతా సత్యం, జి శ్రీనివాసులు, నరసింహారావు, యర్రం వెంకటరెడ్డి,యక్కలి శేషగిరి, ఈశ్వర్ రెడ్డి, వినోద్, రోటీ యస్థాన్ సయ్యద్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు.