దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి – సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు డిమాండ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

రాష్ట్రంలో 175 స్థానాలు పోటీ

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి సమాజ్ వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని యన్ జి ఓ హోం నందు సమాజ్ వాదీ పార్టీ తరపున ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సమాజ్ వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన వ్యతిరేకించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశంలో మిగతా అన్ని రాజకీయ పార్టీలు కులగణన కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు

దేశంలో అత్యధిక జనాభా కలిగిన బిసి మహిళలకు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల లేకపోవడం దుర్మార్గ చర్య అని ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ల లో బిసి కోటా పెట్టే వరకు సమాజ్ వాదీ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు

అదే విధంగా బీహార్ రాష్ట్రప్రభుత్వం కులగణన చేపట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కు కూడా రాష్ట్రంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రత్నయ శక్తిగా ఎదుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు

 

ఈ కార్యక్రమంలో సమాజ్ వాదీ పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలుకుట్ల కళ్యాణ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు యేటూరి శివర్జున్ అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షులు వీర్ల శ్రీనివాస్ యాదవ్,ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవిశంకర్, పెమ్మని బాల వెంకటేశ్వర్లు,వెల్పుల కృష్ణంరాజు, అఖిల భారత యాదవ మహాసభ మండల నాయకులు బాలగాని నాగరాజు, చాగంటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు