లిటిల్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో కుష్ఠువ్యాధి మహిళలకు చీరల పంపిణీ

మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ వైద్యశాలనందు లిటిల్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో కుష్టువ్యాధి గ్రస్తులైన మహిళలకు చీరలను పంపిణీ చేసారు.

వివరాల్లోకి వెళితే లిటిల్ హార్ట్స్ సొసైటీ సభ్యులు వి.శిరీష, శివరాజు ఆధ్వర్యంలో కుష్టువ్యాధి గ్రస్తులైన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న నిర్వహిస్తున్నప్పటికి కుష్టువ్యాధి గ్రస్తులు మందులకొరకు 5వతేదీన రావడంతో ముందుగానే జరుపుతున్నామని అన్నారు. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ రోగులకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ఉన్న గుర్తింపు, ప్రాధాన్యత, అవసరాలను గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరాజు, వి శిరీష, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి, సిస్టర్ చిన్నమ్మ, రమణారెడ్డి, సుబ్బారెడ్డి, సామిరెడ్డి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.