యుక్రెయిన్ నుంచి పొదిలి కి చేరుకున్న వైద్య విద్యార్థి

ప్రవీణ్ రెడ్డి కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న కందుల, కుందూరు,ఉడుముల

పొదిలి పట్టణం విశ్వనాథపురం నందు నివాసం ఉంటున్న మోరా శంకర్ రెడ్డి కుమారుడు మోరా ప్రవీణ్ రెడ్డి 2021 సంవత్సరం వైద్య విద్య అభ్యసించేందుకు యుక్రెయిన్ దేశంలో లోని ఇవానో-ఫ్రాన్కివ్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నందు మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టానని యుద్ధం ప్రారంభంకు పదిహేను రోజుల ముందే భారత ప్రభుత్వం హెచ్చరించిన యూనివర్సిటీ నందు క్లాసులు జరగటంతో వెంటనే రాలేకపోయమని
భారత్ ప్రభుత్వం తుది హెచ్చరికలతో విమానాలలో టిక్కెట్లు బుక్ చేసుకోవడం జరిగిందని ఇంతలో యుద్ధం ప్రారంభం కావడంతో విమాన టికెట్లు క్యాన్సిల్ అయిందని తెలిపారు.

యుద్ధం ప్రారంభం కాగానే భారత రాయబార కార్యాలయం నిరంతరం మాతో టచ్ లో ఉంటూ పలు సూచనలు చేస్తూ మాలో ధైర్యం నెలకొల్పింది అని రాయబారి కార్యాలయం సూచనమేరకు యుక్రెయిన్ సరిహద్దు దేశమేనా స్లోవేకియా సరిహద్దుకు చేరుకున్నామని అని కానీ అక్కడ మమ్మల్ని యుక్రెయిన్ సైన్యం సరిహద్దు దాటకుండా 14 గంటల పాటు నిర్బంధించారని భారత రాయబార కార్యాలయం జోక్యంతో అక్కడినుంచి సురక్షితంగా స్లోవేకియా చేరుకొని అక్కడ రెండు రోజులు బస చేసి అక్కడినుంచి నేరుగా న్యూఢిల్లీ న్యూఢిల్లీ నుంచి ఆంధ్ర భవన్ ఆంధ్ర భవన్ నుంచి తిరిగి విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న మని వైద్య విద్యార్థి ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడని ధైర్యంతో ఏ సందర్భంలో కూడా మేం భయపడలేదని మేము సురక్షితంగా భారత్ చేరుకున్నందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి శంకర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు అయిన మేము భారత ప్రభుత్వంపై నమ్మకంతో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉన్నామని తదుపరి విద్యాభ్యాసం కొనసాగించుటకు భారత ప్రభుత్వం హామీ ఇస్తే తిరిగి తమ కుమారుడు చదివిస్తానని అదే విధంగా తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేర్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

పొదిలి చేరుకున్న ప్రవీణ్ రెడ్డి ని మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి , స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ,మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డిలు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ యుక్రెయిన్ లో విద్య అభ్యసించే విద్యార్థులు యొక్క భవిష్యత్తుపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టి వారి విద్యాభ్యాసం సకాలంలో కొనసాగించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన తెలిపారు