కార్మికుల సమ్మెకు మద్దతుగా కందుల ప్రకటన తో దిగివచ్చిన ప్రభుత్వం సమ్మె విరమణ ప్రకటించిన కార్మికులు

గత నాలుగు రోజుల నుంచి సమ్మె బాట పట్టిన పొదిలి పొదిలి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మార్కాపురం మాజీ శాసన సభ్యులు‌ కందుల నారాయణరెడ్డి మద్దతు ప్రకటించాటంతో ప్రభుత్వం దిగివచ్చి సమ్మెను విరమించే విధంగా చర్యలు చేపట్టింది.


గత నాలుగు రోజులుగా తమకు రావలసిన ఆరు నెలల జీతాలను చెల్లించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా మంగళవారం నాడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని హెచ్చరించిన నేపథ్యంలో సోమవారం నాడు సాయంత్రం నగర పంచాయతీ అధికారులు కార్మికుల తో మాట్లాడి పదివేల నగదు ప్రతి కార్మికుడు ఆగస్టు మొదటి వారంలో ఆరు నెలల జీతం ఇచ్చవిధంగా ఒప్పందం కుదుర్చుకొని సమ్మెను విరమింప చేశారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు మొదటి వారంలో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలల జీతాలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు
edited