కల్వర్టులను కూడా మింగేస్తున్న కబ్జాదారులు

పొదిలిలో రోజురోజుకూ భూ కబ్జాదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ భూములు, చెరువులు, పోరంబోకులలో మాత్రమే కబ్జారాయుళ్లు పాగా వేశారు.

కానీ ఇప్పుడు సీన్ మారింది…. వాగు అలుగులు అక్రమించుకుంటే వర్షాలు పడితే ఎలా?….. కొనేవారు ఎలా కొంటారు?…. ఒకవేళ మనమే ఉపయోగించుకోవాలి అంటే అలుగు నుండి నీరు వస్తే? అనే ప్రశ్నలకు కబ్జారాయుళ్లు సరికొత్తగా ఆలోచించి మంచి ప్లాన్ వేశారు.

నీరు అలుగునుండి వస్తే కదా మనం ఇవన్నీ ఆలోచించాలి అసలు అలుగునుండి నీరే రాకపోతే! అప్పుడు మనం సేఫ్ అనుకున్నారో ఏమో ఏకంగా కాల్వర్టుకు అడ్డుగోడ నిర్మించే పనిలో పడ్డారు.

ఇదంతా జరుగుతుంది ఎక్కడో కాదు కాటూరివారిపాలెం – అగ్రహారం మధ్యలో ఉన్న ఎర్రవాగు అలుగు పైభాగంలో మొదట వెంచర్ పనులు ప్రారంభించారు కబ్జారాయుళ్లు…. వారి వెంచర్ పనులు క్రమేపీ పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు వాగును కూడా అక్రమించునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. వాగునుండి నీరు వెళ్లే దారిని మట్టితో పూర్తిగా నింపేసి చదును చేశారు…. ఇప్పుడు కాల్వర్టును కూడా మూసేశారు.

సుమారుగా 100ఎకరాలకు పైగా ఉన్న ఈ వెంచర్ లో వాగుపొరంబోకు ఎంత…. వెంచర్ కి ఉన్న అనుమతులు ఏమిటో అధికారులు తేల్చాల్సి ఉంది.

దీనిపై పలువురు స్పందిస్తూ వెంచర్ కు ఎటువంటి అనుమతులు లేవని…. అక్రమంగా వాగును ఆక్రమించుకుని వెంచర్ పనులు ప్రారంభించారని….. ఇప్పుడు కాల్వర్టును మూసివేయడంతో నీరు ఒకవైపు మాత్రమే నిలుస్తోందని…. వార్షాభావ పరిస్థితులలో ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని….. పంటపొలాలు మునిగితే రైతులు ఆరుగాలం చేసిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చందం అవుతుందని ఆరోపిస్తున్నారు.

దీనిపై ఇరిగేషన్ అధికారులు, రెవిన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.