సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రికసమ్మె రెండవ రోజు సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుండి ప్రదర్శనగా చిన్నబస్టాండ్ వరకు వచ్చి అనంతరం రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో సిఐటియు మండల నాయకులు వి ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలతో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించేలా కార్మికచట్టాల సవరణకు పూనుకోవడం దారుణమని కార్మికులందరికి కనీస వేతనాలు అమలుచేసి ఉపాధి భద్రత కల్పించాలని, అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత సమగ్రచట్టం రూపొందించాలన్నారు. స్కీమ్ వర్కర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలను కల్పించాలన్నారు. ఈ రాస్తారోకోలో సిఐటియు మండలనాయకులు పి చార్లేస్, గ్రామపంచాయితీ నాయకులు జి నాగులు, కె వి నరసింహం, పి సుబ్బులు, జి ఏసోబు, రిక్షావర్కర్స్ నాయకులు షేక్ సైదా, ఆర్టీసీ కార్మిక నాయకులు యం సురేష్, ఎ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.