అధికారమదం తారాస్థాయికి చేరిందా…?

మండలంలో అధికారపార్టీ నాయకుల పిచ్చి పరాకాష్టకు చేరిందా అనిపించేలా ఇటీవల కొన్ని ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి పనిలోనూ పసుపురంగు లేనిదే పని ముందుకు సాగని పరిస్థితి కనపరుస్తూ తమ పిచ్చిని ప్రదర్శిస్తూ పనులు ముందుకు సాగనివ్వట్లేదని కొందరు వాపోతుండగా…….. మాదే ప్రభుత్వం మేము చేసిందే శాసనం అనిపించేలా ఓ అధికారి స్థానంలో ఓ నాయకుడు వ్యవహరించిన తీరు తెలిసిందే……. ఆ తీరుపై ప్రజలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే……. అయితే ఇటీవల నూతనంగా పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ గ్రాంటుతో ఏర్పాటు చేసిన పైపులైన్లకు పసుపురంగు వేయడంపట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…… ఈ పైపులైన్లను ప్రజలకోసం వేయించారా లేక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకోసం ఏర్పాటు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటె ఎన్నో రాజకీయ పార్టీలను చూశాం ప్రజలసొమ్ముతో చేసే అభివృద్ధి పనులకు పార్టీని అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని కొందరు…… పార్టీ ప్రతిష్టను పెంచుకోవడానికి ఇలాంటి పనులు చేయడంవల్ల పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు…….. ప్రజల గుండెల్లో మనం చేసిన మేలు మాత్రమే గుర్తుంటుంది ఇలాంటి వాటితో ప్రయోజనం లేదు కాబట్టి ప్రజలకు మంచి చేసి పెరు తెచ్చుకోండి అంతేకాని రంగులతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేం అని కొందరు హాస్యాస్పదంగా విమర్శలు చేస్తున్నారు.