నేపాల్ లో భారత అనుకూల పార్టీలు విలీనం….. జనతా సమాజ్ బాదీ పార్టీ ఆప్ నేపాల్ ఏర్పాటు

నేపాల్ దేశంలో క్రమేపీ భారత్ అనుకూల చైనా అనుకూలంగా రాజకీయ పార్టీలు రూపంతంరం చెందుతున్నయి అని చెప్పాలి.

చైనా అనుకూలంగా అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఉండగా మద్యంగా నేపాల్ కాంగ్రెసు పార్టీ భారతసంతతి చెందిన మాధేసి పార్టీలైన సమాజ్ వాది పార్టీ అప్ నేపాల్, రాష్ఠ్రీయ జనతా పార్టీ అప్ నేపాల్ లాంటి మొదలైన పార్టీలు అన్ని కలసి జనతా సమాజ్ బాది పార్టీ అప్ నేపాల్ గా ఏర్పాటు చేసారు.

నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి ఎన్నికల కమిషన్ అనమతి రాకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేసినా చివరికి నేపాల్ ఎన్నికల కమిషన్ విలీనానికి ఆమోదించి నూతన రాజకీయ పార్టీకు గుర్తింపు మంజూరు చేయడంతో నేపాల్ పార్లమెంటులో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

నేపాల్ ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో తిరుగుబాటు పెద్ద ఎత్తున రగులుతున్న వేళ నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు తో నేపాల్ రాజకీయల్లో పెద్ద ఎత్తున మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.