సైన్యానికి స్వేచ్ఛ కల్పించిన భారత్

భారత్ – చైనా సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో హింసాత్మక సంఘటన చోటు చేసుకోవడంతో ఇక నుండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( ఎల్ ఏ సి) వద్ద అసాధారణ పరిస్థితిలో తుపాకీ వాడకానికి అవకాశం కల్పించడం…… పరిస్థితి తగినట్లుగా ఏ విధమైన నిర్ణయాలైనా తీసుకోవడానికి భారత సర్కార్ అనమతి ఇచ్చింది.

భారత- చైనా మద్య 1996, 2005లో చేసుకున్న ఓప్పందాల ప్రకారం (ఎల్ ఎ సి)కి రెండు కిలోమీటర్ల దూరంలో
ఎటువంటి తుపాకీ మరియు పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు….
గాల్వన్ నది వద్ద జరిగిన ఘర్షణలో 20మంది సైనికులు వీర మరణం పొందిన దానిని దృష్టిలో పెట్టుకుని సైన్యానికి స్వేచ్ఛ కల్పించేలా ఉత్తర్వులు జారీచేసినట్లు ఎయన్ఐ వార్త సంస్థ పేర్కొంది.