పొదిలి లో చెదురు మదురు సంఘటన మినహా పోలింగ్ ప్రశాంతం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణం లో సోమవారం నాడు జరిగిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయు నియోజకవర్గాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.

స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మూడు పట్టభద్రుల పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2707 ఓట్లు గాను2113 ఓట్లు గాను 78 శాతం పోలింగ్ నమోదైంది ఒక టీచర్లు పోలింగ్ కేంద్రం 207 ఓట్లు గాను 198 ఓట్లు నమోదు అయ్యాయి

గత శాసనమండలి ఎన్నికల కంటే ఈసారి భారిగా పోలింగ్ నమోదు కావటంతో విశేషం కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి సందీప్ కుమార్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో యస్ఐ మల్లిఖార్జునరావు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

 

పొదిలి ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొని వెళ్ళిన ఎంఎల్ఏ కుందూరు మరియు అనుచరులు

పోలింగ్ కేంద్రాల్లో కి ఎంఎల్ఏ వెళ్లటం ఆందోళనకు దిగిన టిడిపి శ్రేణులు

టిడిపి శ్రేణులు పోలీసులు మధ్య తీవ్రస్థాయిలో వాగివాదం

ఎంఎల్ఏ తన అనుచరులతో రిగ్గింగ్ యత్నం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ

పరిస్థితి ఉద్రిక్తత గా మారటంతో పోలింగ్ కేంద్రం ప్రాంగణం నుంచి వెనుదిరిగిన ఎంఎల్ఏ కుందూరు

అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొని వెళ్ళిన ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలని టిడిపి డిమాండ్

 

పొదిలి పట్టణంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఎంఎల్సీ పోలింగ్ కేంద్రాల్లో కి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి తన అనుచరులతో కలిసి చొచ్చుకొని వెళ్లటం తో టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

 

తక్షణమే ఎంఎల్ఏ కుందూరు నాగార్జున రెడ్డి బయటకు పంపించాలని టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులకు టీడీపీ నాయకులు మధ్య వాగివాదం చోటుచేసుకుంది.

 

పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయటం పోలింగ్ కేంద్రం ప్రాంగణం నుంచి వెనుదిరిగి వెళ్లిపోవడం టిడిపి శ్రేణులు ఆందోళనను విరమించారు.

 

విషయం తెలుసుకున్న సిఐ సుధాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులో తిసుకొని వచ్చారు.