ప్రపంచంలోనే అతిపెద్ద తీవ్రవాదసంస్ధ ఆర్ఎస్ఎస్ అంటూ పాకిస్థాన్ రక్షణశాఖ ప్రచారం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద తీవ్రవాదసంస్ధ అంటూ పాకిస్థాన్ రక్షణశాఖకు సంబంధించిన పాకిస్థాన్ డిఫెన్స్ అనే ట్విట్టర్ ఖాతాలో ప్రకటన చేసింది.

వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ రక్షణశాఖకు సంబంధించిన పాకిస్థాన్ డిఫెన్స్ అనే ట్విట్టర్ ఖాతానందు సోమవారం రాత్రి ఆర్ఎస్ఎస్ గురించిన ప్రకటన చేస్తూ….. హిందుత్వ సిద్ధాంతకర్త హెడ్గేవార్ 1925సెప్టెంబర్ 27 నాడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ధాపించారని…. భారత ఉపఖండంలో ముస్లింలు, క్రైస్తవులు లేని హిందూదేశంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాతో ఏర్పడిన సంస్థ అని అదేవిధంగా 9/11దాడులు తరువాత ఇస్లాంకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసిందని….. ఆర్ఎస్ఎస్ లో మహిళలకు స్ధానం లేకుండా నిరోధించే మగసంస్థ అని సంఘ్ నందు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఏర్పాటైన సంస్థ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పొందుపరుస్తూ ప్రకటన చేసింది.

అలాగే ఆర్ఎస్ఎస్ అనుబంధంగా హిందూ స్వయంసేవక్ సంఘ్ ఏర్పాటుచేసి ఆ పేరుతో ప్రపంచంలో 42దేశాల్లో పని చేస్తుందని అదేవిధంగా శాఖల పేరుతో వేలాది ( హిందూ మదర్సాలు) ఏర్పాటు చేసి హనుమాన్ పేరుతో వానరసైన్యాన్ని తయారు చేసిందని….. 2019జూలైలో ఆర్ఎస్ఎస్ ఒక స్వంత ఆర్మీ తయారు చేసుకుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ అంశంపై పలువురు నిపుణులు మాట్లాడుతూ అసత్యప్రచారాలను చేస్తూ భారతీయుల మధ్య విభేదాలను సృష్టించే విధంగా పాకిస్థాన్ డిఫెన్స్ చేస్తున్న ఈ ప్రయత్నం ఒకవిధంగా కయ్యానికి కాలుదువ్వడమే అని…. దేశభద్రత దృష్ట్యా ఇటువంటి కవ్వింపు చర్యలకు తగిన గుణపాఠం భారతీయ జనతా పార్టీ చెబుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే పాకిస్థాన్ చేస్తున్న ఈ కవ్వింపు చర్యలకు బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది అనేది వేచిచూడాలి.