మానవత్వం పరిమళించిన వేళ…… గోవు ప్రాణాలను కాపాడిన ముస్లిం యువత

మానవత్వం పరిమళించింది…… ఆ మానవత్వమే హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోమాత ప్రాణాలను కాపాడింది.

వివరాల్లోకి వెళితే స్థానిక పెద్దబస్టాండ్ వంతెనపై వెళ్తున్న ఆవును ఆదివారంనాడు రాత్రి వాహనం ఢీకొట్టి వెళ్లగా….. తీవ్ర గాయాలతో నిస్సహాయ స్థితిలో దయనీయంగా పడి ఉన్న అవు చూపరులను కంటతడి పెట్టించింది.

ఏ జీవిది అయినా ప్రాణమే కదా!…. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోమాతను ఆ స్థితిలో చూసిన స్థానిక ముస్లిం యువత చలించిపోయి….. పొదిలిలో నివాసం ఉంటున్న హనుమంతునిపాడు మండల పశువైద్యాధికారిగా పని చేస్తున్న ఖాజా ఖాన్ కు సమాచారం అందించారు.

వాహనం ఢీకొన్న వేగానికి నడిరోడ్డుపై అడ్డంగా పడిపోయిన ఆవును యువత పక్కనే ఉన్న ఫుట్ పాత్ పైకి చేర్చి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు…… సంఘటనా స్థలానికి చేరుకున్న పశువైద్యాధికారి ఖాజాఖాన్ సకాలంలో చికిత్స అందించి ఆవు ప్రాణాలను కాపాడి అనంతరం స్థానికుల సహాయంతో యజమానికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పలువురు హిందువులు, జంతు ప్రేమికులు…. మాకు సంబంధించిన విషయం కాదు అనే బేధం చూపకుండా మానవత్వంతో వ్యవహరించిన ముస్లిం యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారి ఖాన్ , షేక్ జహీర్, దోర్నాల , కత్తి జిలానీ, తదితరులు పాల్గొన్నారు.