నేడు సంచార సంజీవని బస్సులో కోవిడ్ పరీక్షలు: డాక్టర్ చక్రవర్తి

నేడు సంచార సంజీవని బస్సులో కోవిడ్ పరీక్షలు: డాక్టర్ చక్రవర్తి

నేడు సంచార సంజీవని బస్సు నందు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చక్రవర్తి పొదిలి టైమ్స్ కు తెలిపారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా ఉండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు మేరకు పొదిలి పట్టణంలోని విశ్వానాధపురం జూనియర్ కళాశాల నందు గురువారం నాడు గర్భవతులకు కరోనా లక్షణాలు ( జ్వరం, జలుబు, ఆయాసం, మొదలుగునవి ) ఉన్నవారికి మరియు పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని……

కావున పరీక్షలు చేయికోవాలి అనుకునే వారు వారి యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి కోవిడ్ పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని పొదిలి ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి తెలిపారు.