తనిఖీ పేరుతో తమాషా చేసిన అధికారులు నామమాత్రంగా తనిఖీ….. అభిప్రాయ బేధాలతో వ్యాపారులు

పొదిలి : పొదిలి ఆర్టీసీ బస్టాండ్ పరిధిలోని షాపులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి ఆర్టీసీ బస్టాండ్ పరిధిలోని షాపులలో అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్న షాపులలో అధికారులు తనిఖీ పేరుతో తమాషా చేశారు.
అధికారులు నిర్వహించిన తనిఖీలో పలు దుకాణాలలో విక్రయిస్తున్న వస్తువులను అరకొరగా సోదా చేసిన అధికారులు కొన్ని దుకాణాలలో నామమాత్రంగా తనిఖీ నిర్వహించారు.

కారణం ఏంటంటే ఎవరి దుకాణానికి నిర్ణయించిన వస్తువులు మాత్రమే ఆయా దుకాణాల యజమానులు విక్రయాలు జరపాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అధికారులు అండతో కొన్ని షాపులలో మాత్రం అన్ని వస్తువులు అమ్మకాలు జరుపుతుండడంతో టెండర్ నందు ఉన్న వస్తువులు మాత్రమే అమ్మే దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

తనిఖీ నిమిత్తం వచ్చిన అధికారులు మాత్రం టెండర్లలో నిర్ణయించిన వస్తువులను పరిశీలించకుండా……. వస్తువుపై నిర్ణయించిన ధర, అమ్మకం ధర వంటివి పరిశీలించకుండా……ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఎదో సరదాకోసం వచ్చినట్లుగా వస్తువులను పరిశీలించి కొన్ని కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు.

ఈ తతంగం మొత్తం చూస్తూ ఉన్న దుకాణ దారులు మాత్రం ఏ షాపులో నిర్ణయించిన వస్తువులు ఆ షాపులోనే అమ్మకాలు జరపాలని….. అలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తే….. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా…… వస్తువులు మాత్రమే స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారని అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.