సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవ ర్యాలీ

పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని చివరిరోజు అయిన అక్టోబర్ 21సోమవారంనాడు పొదిలి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ర్యాలీని ప్రారంభించారు.

అక్టోబర్‌ 21వతేది 1959వ సంవత్సరంలో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు ఆ రోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు యోధుల త్యాగాలను స్మరించుకునే రోజుగా 1959అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణ దినం నేటికి సరిగ్గా 66సంవత్సరాలు. ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పొదిలి పోలీసు స్టేషన్ నుండి పెద్ద బస్టాండ్ మీదుగా చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాడడంలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ ఈ వారోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు.

పొదిలి ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అలానే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులను నిర్వహిస్తున్న పోలీసులకు ఎప్పుడు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, దొనకొండ, తర్లుపాడు ఎస్ఐలు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.