ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్

పొదిలి ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్దార్ద్ కౌషల్ ఆదేశాల మేరకు పొదిలి ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల గ్రామ పోలీసులు, పంచాయతీ సిబ్బంది కనీస జాగ్రత్తలు వహించకుండా మాస్కులు ధరించకుండా అలాగే నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారులు నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించి కౌన్సెలింగ్ నిర్వహించారు.