అయోధ్య భూ వివాదంపై ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

దేశమంతా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అయోధ్య కేసు విచారణ బుధవారంతో ముగిసింది. అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ 40రోజులపాటు విచారణ సాగుతూ బుధవారంనాడు అనేక నాటకీయ పరిణామాల మధ్య బుధవారంనాడు విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు
పేర్కొంది. మరో మూడురోజుల పాటు లిఖిత పుర్వకంగా సమాధానం వేయవచ్చునని 40రోజులపాటు సుధీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమంత్రి రంజన్ గోగోయ్ తెలిపారు.

నవంబర్ 17వ తేదీన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది…. లేని పక్షంలో ఈ కేసును కొత్త ధర్మాసనం ముందు తిరిగి మొదటి నుంచి వివరించాల్సి వస్తుంది. గత 40రోజులుగా సాగుతున్న అయోధ్య కేసును మొదటిలో అక్టోబర్ 18నాటికి ముగించాలని ధర్మాసనం భావించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 16కు పొడిగించారు. ఇక ఈ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతూ వస్తున్న విషయం తెలిసిందే.

అయోధ్య రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14పిటిషన్లు దాఖలయ్యాయి అన్ని పిటిషన్లు కలిపి విచారణకు స్వీకరించింది సుప్రీం.

సుప్రీం కోర్టులో హైడ్రామా….. న్యాయమూర్తుల అసహనం

దశాబ్దాలుగా కోర్టు కేసుల్లో నలుగుతున్న అయోధ్య – బాబ్రీమసీదు కేసుపై సుప్రీం కోర్టు నందు బుధవారంనాడు విచారణకు చివరి రోజున సుప్రీం ధర్మాసనానికి తమ వాదనల క్రమంలో హిందూ మహాసభ తరుపున వాదిస్తున్న న్యాయవాది ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకాన్ని న్యాయమూర్తికి చూపించారు. అయోధ్య రాముడు పుట్టిననేల అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అన్నారు.

అయితే సదరు న్యాయవాది వాదనలతో ముస్లిం సంస్థల తరుపు న్యాయవాది రాజీవ్ ధావన్ ఏకీభవించలేదు. దీంతో కోర్టులో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదేక్రమంలో రాజీవ్ ధావన్ ఆపుస్తకాన్ని చించివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయవాదుల తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు.. ఇలాగే ప్రవర్తిస్తే తాము వెళ్లిపోతామని అసహనం వ్యక్తం చేశారు. హిందూ సంస్థల తరుపు న్యాయవాది ప్రసారన్ మాట్లాడుతూ.. అయోధ్యలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి 55-60మసీదులు ఉన్నాయని, కానీ హిందువులకు రాముడి జన్మస్థలమైన మందిరం ఒక్కటే ఉందన్నారు.

నవంబర్ 17వ తేదీన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో… ఈ లోపలే
సుప్రీంకోర్టు తన తీర్పును నవంబర్ 16తేదిలోగా ఇచ్చే అవకాశం ఉందని అంచనా…… గత 134ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.