నూతన ఎంపిడిఓ భాద్యతలు స్వీకరణ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా ఈదర విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.

స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మంగళవారం నాడు ఎంపిడివో శోభన బాబు నూతన ఎంపిడిఓ ఈదర విజయలక్ష్మికి బాధ్యతలను అప్పగించారు.

ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టిన ఈదర విజయలక్ష్మి అనంతరం స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపిడిఓ ఈదర విజయలక్ష్మిని పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సత్కరించారు