యుద్ధప్రాతిపదికన బస్సు షెల్టర్ నిర్మాణం పనులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణంలో ఈ వేసవికాలం లో వయోవృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ ఆధ్వర్యంలో బస్సు షెల్టర్ ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది.

పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పొదిలి పెద్ద బస్టాండు ఎన్టీఆర్, వైయస్సార్ విగ్రహాల వద్ద యుద్ధ ప్రాతిపదికన బస్సు షెల్టర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

అర్థరాత్రి లోపల తాత్కాలిక బస్సు షెల్టర్ ఏర్పాటు చేసేందుకు చకాచకా ఏర్పాట్లు ను ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు