పొదిలి లో బీట్ ది హీట్ కార్యక్రమం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

స్వర్ణాంధ్ర స్వచ్చా ఆంద్ర‌ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పొదిలి పెద్ద బస్టాండు నందు” బీట్ ద హీట్ ” కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్థానిక పొదిలి నగర పంచాయతీ కార్యాలయం నుంచి పెద్ద బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద బస్టాండు నందు మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ నిర్వహించారు.

వేసవికాలం లో వయోవృద్ధులు పిల్లలు గర్భిణీ స్త్రీలు ప్రజల సౌకర్యార్థం స్థానిక పొదిలి పెద్ద బస్టాండు నందు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్సు షెల్టర్ ను ప్రారంభించారు

అనంతరం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ, ఉచిత వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ చంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు,స్థానిక టిడిపి నాయకులు గునుపూడి భాస్కర్, ముల్లా ఖూద్దస్, షేక్ రసూల్ మహమ్మద్, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, మహిళా నాయకురాలు శ్రీదేవి మరియు మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు