నియోజకవర్గ సమస్యలపై పోరాడతా : సైదా

పొదిలి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైదా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలోని 84గ్రామాలలో తాగునీరు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని……. ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నా కూడా అధికారపార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ విషయం చర్చించకపోవడం ఎంతో దురదృష్టకరమని అన్నారు.

ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయని…. తాగునీరు ఇవ్వకపోతే తల తీసుకుంటా ఓట్లు అడగను అని ప్రజలకు వాగ్దానం చేసిన అధికారపార్టీ నాయకుడు ఇప్పుడు ప్రచారానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పొదిలిలోని పెద్దచెరువు, చిన్నచెరువులకు సాగర్ నీటిని తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలకల ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల వేలమంది పలక కార్మికులు రోడ్డున పడ్డారని …… నిరాదరణకు గురైన పలక కార్మికులకు ప్రత్యేక పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.

ప్రత్యేకహోదా సాధించాలి అంటే మోడీ పాలన మారాలి….. రాహుల్ గాంధీ రావాలి