మండల నీటి సాధన సమితి కమిటీ ఏర్పాటు

పొదిలి మండల నీటి సాధన సమితి కమిటీ సమావేశం స్థానిక సాయి కళ్యాణమండపంలో నిర్వహించారు. మండల నీటి సాధన సమితి కమిటీ కన్వీనర్ మాకినేని రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు….. ఈ కమిటీలో మాకినేని రమణయ్య, నరసింహారావు, జిసి సుబ్బారావు, కాటూరి వెంకట సుబ్బారావు, యక్కలి శేషగిరిరావు, సోమిశెట్టి చిరంజీవి, ఎస్ చంద్రశేఖర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాకినేని రమణయ్య మాట్లాడుతూ మండల నీటి సాధన సమితి కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుండి నీటి సాధన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంజనీర్లను సంప్రదించి కాలువలు, పైపులైన్లు వంటి పలు రకాల మార్గాలను పరిశీలించి 34కోట్లతో నీటిని మండలానికి తెచ్చుకునే అవకాశం ఉందని మాగుంట శ్రీనివాసులురెడ్డికి వివరించగా జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి పరిశీలన కొరకు సంబంధిత అధికారులకు ఇచ్చినట్లుగా సమాచారం వచ్చిందని ఇది చాలా సంతోషకరమైన వార్త అని ఎన్నికలలోగా పనులు ప్రారంభించేలా ప్రతి ఒక్కరూ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.