కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సైదా ఖరారు

మార్కాపురం నియోజకవర్గం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా షేక్ సైదా పేరును జాతీయ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే షేక్ సైదా అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఎ.ఐ.యస్.యఫ్) పొదిలి పట్టణ అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, పొదిలి డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘం నాయకుడిగా, అఖిల భారత యువజన సమాఖ్య (ఎ.ఐ.యస్.యఫ్) జిల్లా అధ్యక్షులుగా పని చేయడంతో మొదలైన రాజకీయ నేపథ్యం……

అనంతరం 1994 తెలుగుదేశం పార్టీలో చేరి మండల పార్టీ కార్యదర్శిగా, అనంతరం 1998 నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శిగా మరియు జిల్లా కమిటీలో పలు పదవులలో పనిచేశారు.

2001 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేసి 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం వరకు పనిచేశారు.

అనంతరం 2013 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా 2016 నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్న ఆయనను మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జాతీయ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.