మార్కాపురం కోటలో కుందూరు పాగ వేసేనా!

మార్కాపురం నియోజకవర్గంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి బరిలో దిగనున్న కుందూరు నాగార్జునరెడ్డి మార్కాపురం కోటలో పాగ వేసేనా!……..

వివరాల్లోకి వెళితే తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేస్తున్న కుందూరు నాగార్జునరెడ్డి పట్టభద్రుడు అయి ఉండి పలు విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ…… తన తండ్రి అయిన మాజీ శాసనసభ్యులు కుందూరు పెద్ద కొండారెడ్డి వారసత్వ రాజకీయంతో తొలిసారిగా ఎన్నికల బరిలోకిదిగి తన అదృష్టాన్ని పరీక్షించుబోతున్నారు.

బలం : 1. నలభై సంవత్సరాల తన తండ్రి రాజకీయ ప్రయాణం మరియు మామ ఉడుముల శ్రీనువాసులరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం……….
2. ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేకత.

బలహీనత : 1. జంకె వర్గం వీరికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం……..
2. తెదేపా పార్లమెంట్ అభ్యర్థి వైశ్య అభ్యర్థి కావడంతో ఆ వర్గం నుండి పూర్తి స్ధాయిలో పార్టీకి ఓటు బ్యాంకు దూరం జరగడం……….
3. బలమైన పార్టీ నిర్మాణం లేకపోవడం……….
4. బిసి వర్గాలలో పార్టీకి పట్టు లేకపోవడం.

ఇదిలా ఉంటే మాజీ శాసనసభ్యులు అయిన తన తండ్రి మరియు మామల రాజకీయ వ్యూహాలలో భాగంగా వైసీపీ ఓటుబ్యాంకుతో పాటుగా వీరికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను తమకు అనుగుణంగా మార్చుకుని విజయం సాధించాలానే ఎత్తులు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.