నాలుగు లక్షలు నగదు స్వాధీనం

సాధారణ ఎన్నికల సందర్భంగా పొదిలి చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన వాహన తనిఖీ కేంద్రం నందు బుధవారంనాడు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను అధికారులు మరియు పోలీసులు గుర్తించారు….. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో మండల రెవిన్యూ తహాశీల్ధార్ హమీద్, పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్, ఎస్ఐ శ్రీరామ్, ఎన్నికల తనిఖీ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.