అభినందన్ ను పరామర్శించిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

భారత వాయుసేన వింగ్ కామాండర్ అభినందన్ ను భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు.

వివరాల్లోకి వెళితే సుమారు 60గంటలపాటు పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారంనాడు భారత్ అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే…..
వాఘా సరిహద్దులో వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యూఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్ నందు వైద్య చికిత్సలకోసం భారత అధికారులు చేర్పించారు.

శనివారంనాడు భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలోని ఆర్ఆర్ వైద్యశాలకు నందు చికిత్స పొందుతున్న
వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబం సభ్యులతో పలు అంశాలు గురించి అడిగి తెలుసుకున్న ఆమె భారత ప్రజలంతా అభినందన్ వెంట ఉన్నారని ధైర్యంగా ఉండమని అన్నారు.